నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కీసర, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

ఫీడర్ నిర్వహణ మరియు పిఎంఐ  పనుల నేపథ్యంలో కీసర పరిధిలోని కొన్ని ఫీడర్లలో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కీసర ఏఈ ఎస్. మురళీ కృష్ణ తెలిపారు.వివరాల ప్రకారం, కీసర సబ్‌స్టేషన్‌కు చెందిన 11 కె.వి వర్ధన ఫీడర్‌లో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. ఈ సమయంలో పాత కలెక్టర్ కార్యాలయం పరిధి ప్రాంతాలు ప్రభావితమవుతాయి.అలాగే రాంపల్లి సబ్‌స్టేషన్‌కు చెందిన 11 కె వి కరీంగూడ ఫీడర్‌లో మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ క్రమంలో కరీంగూడ గ్రామం, శిల్పా వెంచర్, తారక ఎన్‌క్లేవ్, కాకతీయ ఎన్‌క్లేవ్, శుభకర ఎన్‌క్లేవ్, అక్షయ ఎన్‌క్లేవ్, సాహితి హర హర, లోటస్ కౌంటీ, సాయి కాలనీ, చంద్ర ఎన్‌క్లేవ్, రాజిరెడ్డి ఎన్‌క్లేవ్, మైత్రి నగర్, భగవాన్ కాలనీ, గ్రీన్ సిటీ, నక్షత్ర ఎన్‌క్లేవ్, లెజెండ్ కాలనీ, నీలగిరి ఎస్టేట్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈ ఎస్. మురళీ కృష్ణ సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .