ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి

ఆన్లైన్ టార్గెట్ల పేరుతో వేధింపులు ఆపాలి – సీఐటీయూ

ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి

మేడ్చల్–మల్కాజిగిరి, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆశా వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా యు.పి.హెచ్.సి/పి.హెచ్.సి కేంద్రాల్లో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కె. ఉన్ని కృష్ణన్ మాట్లాడుతూ, జనవరి నెల వేతనాలు కొందరికి మాత్రమే చెల్లించగా, మిగిలిన వారికి ఇప్పటికీ ఇవ్వలేదని తెలిపారు. వేతనాల గురించి ప్రశ్నిస్తే “ప్రభుత్వం వద్ద నిధులు లేవు, నిధులు వచ్చిన తర్వాత ఇస్తాం” అని అధికారులు సమాధానం చెబుతున్నారని విమర్శించారు. జిల్లాలో మొత్తం 1270 మంది ఆశా వర్కర్లు ఉన్నప్పటికీ కొందరికి మాత్రమే వేతనాలు చెల్లించడం సరికాదని ప్రశ్నించారు.రూ.9,700 మాత్రమే జీతంగా పొందుతున్న ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పడం అన్యాయమని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ పనుల పేరుతో రోజుకు 50–100 టార్గెట్లు పెట్టి చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఆశా వర్కర్లు ఏఎన్ఎం అకౌంట్‌లో లాగిన్ అయి ఆన్లైన్ పనులు చేస్తున్నప్పటికీ, టార్గెట్ పూర్తి చేయకపోతే దుర్భాషలాడటం, బెదిరింపులు చేయడం, రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడం జరుగుతోందని తెలిపారు.ఈ చర్యలను సీఐటీయూ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని, ఆశా వర్కర్లపై వేధింపులు ఆపకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి నేడు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో ఆశా వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లాలోని కుషాయిగూడ, ఉప్పల్, బాలానగర్, శ్రీరంగవరం, మల్కాజిగిరి, జవహర్‌నగర్, దిడిగల్, కీసర, రామంతాపూర్, కొత్తపేట, జగద్గిరిగుట్ట, హస్మత్‌పేట, అంబేక్‌నగర్, చీరాలపల్లి, మల్లాపూర్ తదితర పిహెచ్‌సీలలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.IMG-20260211-WA0038

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి  ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి 
వడ్డేపల్లి,ఫిబ్రవరి11(తెలంగాణ ముచ్చట్లు) : వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి తన...
నేరెడ్‌మెట్ డివిజన్‌లో 5 సంవత్సరాల అభివృద్ధి స్వర్ణయుగం
ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ
నాగిలిగొండ గ్రామంలో పశు వైద్య శిబిరం.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు
ఎడిషన్, డార్విన్ జయంతి సందర్భంగా వైజ్ఞానిక నీరాజనం