అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఎస్ ఎస్ కె అకాడమీకి స్వర్ణవిజయం

నాగారం విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఎస్ ఎస్ కె అకాడమీకి స్వర్ణవిజయం

నాగారం, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ సర్కిల్ నాగారం ప్రాంతానికి చెందిన ఎస్ ఎస్ కె మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రతిభ చాటారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 8న నిర్వహించిన 5వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో అకాడమీ విద్యార్థులు స్వర్ణ, వెండి పతకాలు సాధించి గర్వకారణంగా నిలిచారు.అకాడమీ వ్యవస్థాపకులు, ప్రధాన శిక్షకులు మాస్టర్ కే. సాయి కిరణ్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన విద్యార్థులు కటాస్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. పోటీల్లో పి. హ్రిషిత శ్రీ, చిట్టి పావిక, వి. హరివర్ధన్ గౌడ్, ఏ. విద్యా శ్రీ స్వర్ణ పతకాలు సాధించగా, కే. నుక్రీతిక, వి. ఓం ప్రకాష్ సాగర్ వెండి పతకాలు గెలుచుకున్నారు.విద్యార్థుల విజయానికి క్రమశిక్షణతో కూడిన కఠిన శిక్షణ, నిరంతర సాధన ప్రధాన కారణమని మాస్టర్ కే. సాయి కిరణ్ తెలిపారు. విజేతలను తల్లిదండ్రులు, స్థానిక క్రీడాభిమానులు అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి కీర్తి తీసుకురావడమే తమ లక్ష్యమని అకాడమీ నిర్వాహకులు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి  ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి 
వడ్డేపల్లి,ఫిబ్రవరి11(తెలంగాణ ముచ్చట్లు) : వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి తన...
నేరెడ్‌మెట్ డివిజన్‌లో 5 సంవత్సరాల అభివృద్ధి స్వర్ణయుగం
ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ
నాగిలిగొండ గ్రామంలో పశు వైద్య శిబిరం.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు
ఎడిషన్, డార్విన్ జయంతి సందర్భంగా వైజ్ఞానిక నీరాజనం