పట్టుదల ఫలితం

ఖమ్మం కి చెందిన అర్వపల్లి అఖిల నాగ రమ్య, సీఎంఏ  లో ఘన విజయం

పట్టుదల ఫలితం

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 11(తెలంగాణ ముచ్చట్లు)

ఖమ్మం నగరానికి చెందిన అర్వపల్లి అఖిల నాగ రమ్య గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజ్‌లో  సిఎంఏ (కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్) కోర్సును పూర్తి స్థాయిలో విజయవంతంగా ఉత్తీర్ణతతో సాధించారు. నిరంతర శ్రమ, క్రమశిక్షణతో కూడిన చదువు ఆమెను ఈ ఉన్నత విజయానికి చేర్చిందని ఉపాధ్యాయులు ప్రశంసించారు. అఖిల నాగ రమ్య 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మామిళ్ళ గూడెం లోని మాంటిస్సోరి హైస్కూల్‌ లో విద్యనభ్యసించి, టెన్త్‌లో 9.5 జి.పి.ఎ సాధించారు. సాహితి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లలో కాలేజ్ టాపర్‌గా నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు. ఆమె తల్లిదండ్రులు అర్వపల్లి నాగేష్, శ్రీలక్ష్మి స్థానికంగా చిన్న కిరాణా వ్యాపారం నిర్వహిస్తూ కుమార్తె చదువుకు అన్ని విధాలుగా వారి సంపూర్ణ సహకారం అందించారు. చెల్లెలు యువ నాగశ్రీ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానికులు, అలాగే ఆమె చిన్ననాటి స్నేహితురాలు షేక్ తబస్సుమ్ అఖిల నాగ రమ్యకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .