ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ

పోలింగ్ సరళి, పోలీస్ బందోబస్త్ పరిశీంచిన పోలీస్ కమిషనర్

ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 11(తెలంగాణ ముచ్చట్లు)

జిల్లాలో కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎదులాపురం, వైరా, కల్లూరు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఎన్నికల నేపథ్యంలో పలు పోలింగ్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ సందర్శించారు. పోలీస్ బందోబస్త్ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, రామానుజం, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తో పోలింగ్ పక్రియ, బందోబస్త్ ఏర్పాట్లపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా  పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛా
యుతంగా నిర్వహించేందుకు
అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుతIMG-20260211-WA0035
వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .