రాధిక చౌరస్తాలో ఆటో కార్మికుల భారీ నిరసన
_11 డిమాండ్ల సాధన కోసం ధర్నా
– మీటర్ చార్జీల పెంపు, టూవీలర్ టాక్సీల నిషేధం డిమాండ్
ఏ ఎస్ రావు నగర్, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
రవాణా రంగ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం రాధిక చౌరస్తాలో ఆటో కార్మికులు భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. శ్రీ చైతన్య నారాయణ గ్రూప్ మరియు పలు విద్యాసంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో ఆటోలను రోడ్డుపై నిలిపివేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఆటో కార్మికులు పెరుగుతున్న ఇంధన ధరలు, ఫిట్నెస్ ఫీజుల భారంతో పాటు ఆన్‌లైన్ టాక్సీ సంస్థల పోటీ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం నాయకులు తెలిపారు. తమ 11 న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పూసపల్లి రాజేష్, జాయింట్ సెక్రెటరీ ఎండి అనీఫ్, జనరల్ సెక్రెటరీ పి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు. భవాన్స్ స్కూల్ ప్రెసిడెంట్ రాజేష్, ఏఎస్ రావు నగర్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, భాష్యం స్కూల్ ప్రెసిడెంట్ రాములు నాయక్, వైస్ ప్రెసిడెంట్ బాబు, జాయింట్ సెక్రెటరీ సిద్ధి రాములు తదితరులు సంఘీభావం తెలిపారు.
ప్రధాన డిమాండ్లలో ఆటో మీటర్ చార్జీల పెంపు, రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఓలా–ఉబర్–రాపిడో టూవీలర్ టాక్సీల నిషేధం, మోటార్ వాహన చట్టం–2019 రద్దు, 15 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్నెస్ ఫీజుల తగ్గింపు, కౌంటర్ సిగ్నేచర్ పర్మిషన్ అమలు, హెవీ డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు, హయ్యర్ వెహికల్ చార్జీల పెంపు, ఐటీ టాక్సీల కిలోమీటర్ చార్జీల పెంపు, ఆటోలు–క్యాబులకు ఈ-చలాన్ల నుంచి మినహాయింపు వంటి అంశాలు ఉన్నాయి.
డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో ఆటో మరియు రవాణా రంగ కార్మికులు పాల్గొన్నారు.


Comments