దేహదానంతో అమరురాలైన వెంకమ్మ.!

దేహదానంతో అమరురాలైన వెంకమ్మ.!

- నేత్రదానంతో ఇద్దరికి చూపు.
- సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ సహకారంతో.

సత్తుపల్లి, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక మండలం బేతుపల్లి గ్రామానికి చెందిన నల్లమోతు వెంకమ్మ (82), (భర్త లేటు రాఘవయ్య), బుధవారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. వెంకమ్మ పార్థివ దేహానికి బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ నివాళి అర్పించి, ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆమె పార్థివ దేహం వైద్య విద్యార్థులకు విద్యాభ్యాసానికి ఉపయోగపడాలని, కుమార్తెలు బొంతు అనసూర్య (భర్త రామారావు), తన్నీరు పుష్పావతి (భర్త లింగయ్య)లతో మాట్లాడి, మరణానంతరం అగ్గిపాలయ్యే నేత్రాలను దానం చేసి మరో ఇద్దరికి ఉపయోగపడాలని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల సమ్మతితో సత్తుపల్లి లయన్స్ క్లబ్ నేత్రనిధి ఆధ్వర్యంలో వాహనం ఏర్పాటు చేసి, అనంతరం ఆమె పార్థివ దేహాన్ని కిమ్స్ మెడికల్ కళాశాల, నార్కెట్‌పల్లికి తరలించారు. గ్రామస్థులు సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్‌ను అభినందిస్తూ, ఆయన తీసుకున్న నిర్ణయం వైద్య విద్యార్థులకు ఉపయోగపడుతుందని పేర్కొంటూ వెంకమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .