మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధమ కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
Views: 23
On
నాచారం, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్‌గా నియమితులైన వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్‌ను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నాచారం లోని ఎంఎంసి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజిగిరి నగర అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల మెరుగుదల వంటి అంశాల్లో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పౌరసేవలు అందించేందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, బారాస నాయకులు విట్టల్ యాదవ్, చంద్రశేఖర్, గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments