బండారి రాజిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

బండారి రాజిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

నాచారం, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ తొలి శాసనసభ్యులు కీర్తిశేషులు బండారి రాజిరెడ్డి 79వ జయంతి సందర్భంగా నాచారంలోని ఉదయ్ కుమార్ సినీప్లెక్స్ వద్ద ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బండారి రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బండారి రాజిరెడ్డి చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రజా సేవలో ఆయన చూపిన నిబద్ధత తమకు ఆదర్శమని పేర్కొన్నారు.బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ, 2004 మార్చి 14న తన రాజకీయ ప్రస్థానం అప్పటి కాప్రా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన బండారి రాజిరెడ్డి ఆశీస్సులతో ప్రారంభమైందని గుర్తుచేశారు. ఆయన నాయకత్వం, మార్గదర్శకం తన రాజకీయ జీవితానికి పునాది వేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .