వనపర్తి మునిసిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు

డిఎస్ మహేష్ వనపర్తి జిల్లా నాయకులు 

వనపర్తి మునిసిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు

వనపర్తి,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి మునిసిపాలిటీలో గెలుపొందిన అభ్యర్థులకు జిల్లా నాయకుడు డి ఎస్ మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మాట్లాడుతూ మునిసిపల్ పరిధిలో మొత్తం 33 వార్డుల్లో  కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకుందని తెలిపారు.ఇతర పార్టీల అభ్యర్థులు మిగతా స్థానాల్లో గెలిచారని పేర్కొన్నారు.వనపర్తి ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత బాధ్యతతో పని చేస్తామని తెలిపారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలిపారు.తెలంగాణ ప్రజలు పార్టీకి ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతాయని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ పర్యవేక్షకురాలు మీనాక్షి నటరాజన్ కు ధన్యవాదాలు తెలిపారు.అలాగే స్థానిక నాయకత్వం సహకారంతో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని తెలిపారు.ఎమ్మెల్యే  మేఘారెడ్డి, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు  చిన్నారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ
వనపర్తి,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.జిల్లాలో సాంస్కృతిక,...
విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్‌లో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం
మల్లికుదుర్లలో గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక వర్గ  కమిటీ ఎన్నిక
అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది  
కేటీఆర్, హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన పాండాల శివకుమార్ గౌడ్
చిన్న పత్రికలపై చిన్న చూపు తగదు
వనపర్తి మునిసిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు