ప్రశాంతంగా పురపాలక ఎన్నికల కౌంటింగ్..... 

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రశాంతంగా పురపాలక ఎన్నికల కౌంటింగ్..... 

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి -13(తెలంగాణ ముచ్చట్లు)

జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపల్ కౌంటింగ్ సెంటర్ లో గురువారం కౌంటింగ్ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ నుండి అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి 5 మునిసిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మధిర, సత్తుపల్లి, ఏదులాపురం, వైరా, కల్లూరులో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.IMG-20260213-WA0097 ప్రతి మున్సిపాలిటీ పరిధిలో 2 రౌండ్ ల చొప్పున కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టి ఫలితాలు ప్రకటించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .