33వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.. ప్రచారంలో వడ్డే శేఖర్ కీలక పాత్ర

33వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.. ప్రచారంలో వడ్డే శేఖర్ కీలక పాత్ర

వనపర్తి,ఫిబ్రవరి13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి మున్సిపాలిటీ 33వ వార్డు ఇన్చార్జిగా వ్యవహరించిన పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్ గెలుపుకు విశేషంగా కృషి చేశారు. ప్రచార సమయంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టడంలో నాయకులు కీలక పాత్ర పోషించారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ విజయంతో మాధవి మున్సిపల్ చైర్మన్ పదవిని చేపట్టబోతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి ఈ విజయాన్ని అందించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వడ్డే శేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గెలుపొందిన ఎస్ఎల్ఎన్ మాధవిని కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్ ఎల్ ఎన్ మాధవి నాయకత్వంలో వనపర్తి పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో వడ్డే శేఖర్‌తో పాటు మల్లికార్జున్, గుండెల ఆంజనేయులు, మద్దూర్ వెంకటయ్య, మద్దూర్ నరసింహ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .