వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. వెల్టూరులో సంబరాలు

వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. వెల్టూరులో సంబరాలు

పెద్దమందడి,ఫిబ్రవరి13(తెలంగాణ ముచ్చట్లు):

మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకున్న సందర్భంగా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు వడ్డె శేఖర్ ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి వనపర్తి మున్సిపాలిటీ ను కైవసం చేసుకోవడంతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలోని ప్రధాన వీధుల్లో పార్టీ శ్రేణులు భారీగా చేరుకుని కాంగ్రెస్ విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి నాయకత్వంలో పార్టీ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఎమ్మెల్యే కృషి వల్లే పార్టీ బలోపేతం అయి ప్రజల విశ్వాసాన్ని పొందిందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెరగడం కూడా ఈ విజయానికి ప్రధాన కారణమని కొనియాడారు. వనపర్తి పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.అదేవిధంగా, వడ్డే శేఖర్ నేతృత్వంలో ఆయన టీం వనపర్తి మున్సిపాలిటీ 33వ వార్డు ఇన్చార్జిగా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొని, ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి గెలుపుకు విశేషంగా కృషి చేశారు. ఎస్ ఎల్ ఎన్ మాధవి వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా పదవి చేపట్టబోతుందని తెలిపారు. ఎమ్మెల్యే సమర్థ నాయకత్వం, కార్యకర్తల సమన్వయం వల్లే పార్టీకి ఈ స్థాయిలో విజయాన్ని అందించగలిగామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.ఈ విజయంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొనగా, వెల్టూర్ లో సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. ఈ కార్యక్రమంలో  గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి (బాబు రెడ్డి), మాజీ సర్పంచ్ బాలచంద్రయ్య,సీనియర్ నాయకులు విజయ్ కుమార్, మల్లికార్జున్, గుండెల ఆంజనేయులు, మద్దూర్ వెంకటయ్య, మద్దూర్ నరసింహ,నరాల నాగభూషణ్, రవీందర్, చందు రెడ్డి, అనంతరెడ్డి, మహేష్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నాగరాజు గౌడ్, నవీన్, రామచంద్రయ్య, మిల్లర్ రాజు, బండి ప్రవీణ్ కుమార్, గొర్రె వెంకటయ్య, రాములు, నరాల బాబు, లాల్ పలువురు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ: శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ:
​ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి13(తెలంగాణ ముచ్చట్లు) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామ శివాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఏటా అత్యంత వైభవంగా...
నేడు విద్యుత్ లైన్ల మరమ్మతులతో  సరఫరా నిలిపివేత
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
నేరడలో కబడ్డీ పండగ
శివరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం.!
వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. వెల్టూరులో సంబరాలు
33వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.. ప్రచారంలో వడ్డే శేఖర్ కీలక పాత్ర