మడిపల్లి–ఎల్కతుర్తి డబుల్ లేన్ రహదారికి రూ.13 కోట్ల ఆమోదం

మడిపల్లి–ఎల్కతుర్తి డబుల్ లేన్ రహదారికి రూ.13 కోట్ల ఆమోదం

ఎల్కతుర్తి, ఫిబ్రవరి 13: (తెలంగాణ ముచ్చట్లు) 

హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామం నుండి ఎల్కతుర్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జంక్షన్ వరకు 5 కిలోమీటర్ల పొడవున డబుల్ లేన్ బీటీ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.13 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.
ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొర్రె మహేందర్ వెల్లడించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక చొరవతోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని ఆయన పేర్కొన్నారు. జీవో నం.205ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ శుక్రవారం జారీ చేసినట్లు తెలిపారు.
రహదారి నిర్మాణ పనులను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ రహదారి పూర్తయితే ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించడంతో పాటు వ్యాపార, విద్యా, అత్యవసర సేవల రాకపోకలు వేగవంతం అవుతాయని వివరించారు.
ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .