ఉమ్మడి ఖమ్మం జిల్లాలోపొంగులేటి, భట్టి మార్క్..
*మధిర, వైరా మున్సిపాలిటీ పై మూడు రంగుల జెండా*
*కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతూ..*
*ఫలించిన మంత్రి పొంగులేటి వ్యూహాలు*
*మున్సిపల్ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ లో పెరిగిన జోష్...*
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 13(తెలంగాణ ముచ్చట్లు )
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఆదరణ లభిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన దూకుడు ప్రదర్శిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి కార్పోరేషన్, 7 మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను చూపించింది. 118 వార్డుల్లో 84 స్థానాలు కైవసం చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మార్క్ ను చూపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ గెటు తాకనీయను అన్నట్టుగానే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడించారు. ఖమ్మం జిల్లాలోని వైరా, మధిర మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన వ్యూహాలను రచించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పట్టు బిగించారు. దాంతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైన ఏదులాపురం మున్సిపాలిటీలో తన సత్తాను మరోసారి చాటారు. కల్లూరు, సత్తుపల్లి, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీ, కొత్తగూడెం కార్పొరేషన్ లలో విపక్షాలను టార్గెట్ చేసి ప్రసంగాలు రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. బీఆర్ఎస్, సీపీఎం పార్టీల అభ్యర్థులను కంటి మీద కునుకు లేకుండా వ్యూహాలు రచించారు.
మధిర, వైరా మున్సిపాలిటీ పై మూడు రంగుల జెండా..
పట్టు వదలని విక్రమార్కుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరో మారు రుజువయ్యింది. మధిర మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని పట్టుబట్టి ఓవైపు పార్టీ శ్రేణులను కదిలించారు, పోరాట స్ఫూర్తిని నింపారు. మరోవైపు రాబోయే 50 సంవత్సరాలకు సరిపడా మధిర అభివృద్ధికి చేస్తున్న కృషిని ఓటర్లకు తానే స్వయంగా వివరించి వారి మనసు గెలిచి ఘన విజయం సాధించారు. అన్ని తానై ముందుకు నడిచిన భట్టి విక్రమార్క తిరుగులేని ప్రజా నాయకుడని తాను ఓ క్యాడర్ లీడర్ అని మరోసారి నిరూపించుకున్నారు. భట్టి విక్రమార్క ఏ పని చేసిన పద్ధతి ప్రకారం చేస్తారు ఫలితం సాధిస్తారని మరోసారి స్పష్టమైంది. గత పది సంవత్సరాలు మన పార్టీ అధికారంలో లేదు, మున్సిపాలిటీ కూడా మన చేతిలో లేదు ఆ పార్టీ అభివృద్ధి నిధులు కూడా మంజూరు చేయలేదు ఈ సమయంలో మధిర ఎమ్మెల్యేగా మున్సిపాలిటీ బోర్డు పై ఒత్తిడి తెచ్చి పనులు చేయించడం సాధ్యం కానీ పని అని విజ్ఞుడైన, ప్రజాస్వామ్యవాది భట్టి విక్రమార్క మౌనంగా భరించారు. తిరిగి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిప్యూటీ సీఎం గా ఆర్థిక, విద్యుత్తు మరియు ప్రణాళికా శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేతికి వచ్చాయి.
కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతూ..
ఇదే అదును తనను వరుసగా ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిపించిన మధిర ప్రజల రుణం తీర్చుకునే అవకాశం దక్కింది అని భావించిన డిప్యూటీ సీఎం తన ఏళ్ల నాటికలను సహకారం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రాజకీయ పొత్తులు, కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ప్రచారం, అభివృద్ధి ఎత్తుగడ ప్రతి అంశంలో అనుకున్నట్టు ముందుకు వెళ్లి అద్భుత విజయాన్ని ప్రజానాయకుడు మన భట్టి విక్రమార్క అందిపుచ్చుకున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతూ, నిత్యం విమర్శలతో విషం చిమ్మే విపక్షాలను పల్లెత్తు మాట అనకుండా, చిన్న అల్లరి లేకుండా అదరక, బెదరక తాను నమ్మిన పద్ధతుల్లో ముందుకెళ్లి భట్టి భేష్ అనిపించుకున్నారు. మధిర మున్సిపాలిటీలో ఏ పార్టీ బలం ఎంతో వాస్తవంగా వివరించి టిడిపి తో కూటమిగా బరిలో దిగారు. 22 వార్డుల్లో టిడిపి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు మూడు వార్డుల్లో పోటీలో నిలవగా మిగిలిన 19 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు.
ఫలించిన మంత్రి పొంగులేటి వ్యూహాలు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, కల్లూరు, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు మున్సిపాలిటీ, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక నుంచి ప్రచారం వరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మార్క్ ను చూపించారు. అయా మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాల్లో బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తూ ముందు సాగారు. ఎన్నికల చివరి రోజున కమ్యునిస్టు పార్టీలను, బీఆర్ఎస్ పార్టీని నాయకులకు అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లో కూడా తన మార్క్ ను చూపించారు. ఖమ్మం జిల్లాలో 118వార్డులో 84 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఎదులాపురం, సత్తుపల్లి, కల్లూరు, అశ్వారావుపేట, ఇల్లందు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 21 స్థానాలకు సరిపెట్టుకుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరింత జోష్ పెరిగే అవకాశం ఉందని రాజకీయ నాయకులు చెప్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ పెరిగిన జోష్...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కు జోష్ పెరిగింది. ఏ ఎన్నికై న కాంగ్రెస్ పార్టీ దే హవా అనట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. గతంలో సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు కొనసాగించిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తన సత్తాను చాటి ప్రతిపక్షాలను మట్టుకురిపించింది.


Comments