నేడు విద్యుత్ లైన్ల మరమ్మతులతో  సరఫరా నిలిపివేత

చర్లపల్లి, ఫిబ్రవరి 13 (తెలంగాణ ముచ్చట్లు):

చర్లపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని 33/11 కేవీ ఎన్‌ఎన్ కాలనీ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన లైన్ల మరమ్మతుల పనులు శనివారం (ఫిబ్రవరి 14) నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో 11 కేవీ విస్టా హోమ్స్ మరియు 11 కేవీ జమ్మిగడ్డ ఫీడర్‌ల పరిధిలో మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు.విస్టా హోమ్స్, శుభోదయ కాలనీ, శివ సాయి నగర్, లక్ష్మీనరసింహ స్వామి కాలనీ, ఎన్‌ఎన్ కాలనీ, రోడ్ నెంబర్–1, జమ్మిగడ్డ, వెంకట సాయి ఎంక్లేవ్, వీఎన్ రెడ్డి కాలనీ, డి మార్ట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోతుందని అధికారులు వెల్లడించారు.పనులు పూర్తయ్యిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని, వినియోగదారులు సహకరించాలని చర్లపల్లి–2 ఏఈ (ఆపరేషన్) టి. బాలరాజు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .