తన ఇంటి బిడ్డగా భావించి గెలిపించారు.
ఐదో వార్డు కౌన్సిలర్ హకీమ్ పాషా.
Views: 44
On
సత్తుపల్లి, ఫిబ్రవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఐదో వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హకీమ్ పాషా 82 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమయి దయానంద్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ తన ఇంటి బిడ్డగా భావించి, తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారని, పోటీలో నిలవాలని ప్రోత్సహిస్తూ తనకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో వార్డులోని సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని, ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కార దిశగా కృషి చేస్తానని చెప్పారు. తనతో పాటు గెలుపొందిన ఇతర కౌన్సిలర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments