మల్లికుదుర్లలో గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక వర్గ కమిటీ ఎన్నిక
Views: 7
On
వేలేరు, ఫిబ్రవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో ప్రసిద్ధి చెందిన గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానానికి నూతన పాలకవర్గ కమిటీ ఎన్నికైంది. ఆలయ అభివృద్ధి, నిర్వహణ, భక్తులకు సౌకర్యాల విస్తరణ లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటైంది.ఆలయ కమిటీ చైర్మన్‌గా పల్లె నిరంజన్ రెడ్డి నియమితులయ్యారు. డైరెక్టర్లుగా పిండి బాలకొమురయ్య, కురుసపెల్లి ప్రేమానందం, మెరుగు కోమాల, కొలను ఒగ్గు రాజకుమార్, కోతి సాంబరాజులు నియామకమయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు మరియు పలువురు ప్రముఖులు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలపడేలా కమిటీ కృషి చేయాలని సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
14 Feb 2026 21:59:57
వనపర్తి,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.జిల్లాలో సాంస్కృతిక,...


Comments