విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్‌లో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం

విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్‌లో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం

నాగారం, ఫిబ్రవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):

శిల్పానగర్‌లోని విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్ లో వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల క్రీడా కేకలతో కిటకిటలాడింది.
ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ డాక్టర్ నంద్యాల నరసింహారెడ్డి పాల్గొని బెలూన్లు ఎగురవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని, క్రీడలు ఆ దిశగా కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. దేశం మనకేమి ఇచ్చిందనే దానికంటే దేశానికి మనం ఏమి ఇస్తున్నామనే భావనతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు పిరమిడ్స్, టైక్వాండో, ఆర్చరీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, లాంగ్ జంప్, షాట్‌పుట్, స్కేటింగ్ వంటి విభిన్న క్రీడల్లో ప్రతిభ కనబరిచారు. మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ సైక్లిస్ట్ సంస్థ ఫౌండర్ రవీందర్ నందనూరి విశిష్ట అతిథిగా పాల్గొని సైక్లింగ్ ప్రయోజనాలను వివరించారు.విజేతలకు పతకాలు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కె. సరితా రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ రాణి రుద్రమా దేవి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260214-WA0101

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .