అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది  

వరంగల్ ఎంపి కడియం కావ్య 

అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది  

వరంగల్,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు):

పుల్వామా అటాక్ లో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటించారు. మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
హనుమకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిగ్నల్ పాయింట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో ఎంపీ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. కొవ్వొత్తుల వెలుగులో జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా డా.కడియం కావ్య మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల త్యాగం, దేశభక్తి ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. కొవ్వొత్తుల వెలుగుతో అమరుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి అజేయ ఆత్మస్థైర్యానికి వందనం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జి సురేందర్ నాథ్, వైస్ ప్రెసిడెంట్లు ప్రభాకర్, నారాయణ చారి, జనరల్ సెక్రెటరీ ఎలిగేటి శ్రీనివాస్, కోశాధికారి కిషోర్జి, సీఏపీఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. IMG-20260214-WA0103

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .