అల్టిట్యూడ్ హైస్కూల్లో పుల్వామా అమర వీరులకు ఘన నివాళి

అల్టిట్యూడ్ హైస్కూల్లో పుల్వామా అమర వీరులకు ఘన నివాళి

ఎల్కతుర్తి. ఫిబ్రవరి 14 (తెలంగాణ ముచ్చట్లు);

ఎల్కతుర్తి మండలంలోని అల్టిట్యూడ్ హైస్కూల్‌లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా అమర వీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనం పాటించారు. ఉపాధ్యాయులు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి గురించి విద్యార్థులకు వివరించారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల త్యాగస్ఫూర్తి ప్రతి భారతీయుడు ఎప్పటికీ మరవకూడదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పుస్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ, “దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లు మనందరికీ ఆదర్శప్రాయులు. వారి త్యాగం వలననే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. విద్యార్థులు చిన్నప్పటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం అలవరచుకోవాలి. అమర వీరుల స్ఫూర్తిని జీవితాంతం గుర్తుంచుకోవాలి” అని తెలిపారు.
విద్యార్థులు దేశభక్తి గీతాలు పాడుతూ అమర వీరుల సేవలను స్మరించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తాయని పాఠశాల యాజమాన్యం తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నవీన్, వైస్ ప్రిన్సిపాల్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయులు కIMG-20260214-WA0049ర్రే తిరుపతి, సరితా, లావణ్య, ఆశా బేగం, కృష్ణా, రమేష్, సరిత, శ్రావణి, శ్వేత, స్వప్న, కవిత, మమత,అనుష, గీత, కావ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .