ఆగారంలో రెడ్ల కుంట చెరువు తూములను పరిశీలించిన అధికారులు

ఆగారంలో రెడ్ల కుంట చెరువు తూములను పరిశీలించిన అధికారులు

త్వరలో మరమ్మతు పనులు ప్రారంభం

-- నీటిపారుదల శాఖ అధికారులు 

ఖిల్లా ఘనపూర్,ఫిబ్రవరి27(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం పరిధిలోని ఆగారం గ్రామంలో ఉన్న రెడ్ల కుంట చెరువు తూములను నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించారు. చెరువు తూముల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన మరమ్మతు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.చెరువులో నీటి నిల్వ మరియు సాగునీటి సరఫరాకు తూములు కీలకమని అధికారులు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూముల బలపరిచే పనులతో పాటు అవసరమైన చోట పునర్నిర్మాణ చర్యలు చేపడతామని వెల్లడించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకుడు మున్నూరు జయాకర్, గ్రామ సర్పంచ్ నర్సమ్మ, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. చెరువు పనులు త్వరగా ప్రారంభించాలని రైతులు కోరగా, అధికారులు సానుకూలంగా స్పందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .