మహా శివరాత్రి సందర్భంగా శివసాయి నగర్ శివాలయంలో భక్తుల రద్దీ

మహా శివరాత్రి సందర్భంగా శివసాయి నగర్ శివాలయంలో భక్తుల రద్దీ

కుషాయిగూడ, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రాసర్కిల్ కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివసాయి నగర్ శివాలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం, మహామంగళహారతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడ్డాయి.
మహాశివరాత్రి ఉపవాస దీక్షలో ఉన్న భక్తుల కోసం కనకదుర్గమ్మ ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమాలుIMG-20260215-WA0055 చేపట్టారు. ట్రస్ట్ సభ్యులు నాగరాజు, సుబ్బయ్య, వేణు, భాస్కర్, శ్రీకాంత్, శ్రీను, సురేష్ తదితరుల ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన భక్తులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ మహా శివరాత్రి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పర్వదినమని, భక్తుల సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .