మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ 

ప్రముఖుల దర్శనం

మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ 

కీసర గుట్ట , ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు): 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకు ని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ ఉప్పొంగింది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండగా, దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.ఈ సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రోడ్లు-భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులతో కలిసి వారు ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కీసర నుండి గుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. భక్తులకు మెరుగైన రవాణా, IMG-20260215-WA0114మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .