శివరాత్రి వేళ 15వ బెటాలియన్‌లో మహా అన్నదానం.

శివరాత్రి వేళ 15వ బెటాలియన్‌లో మహా అన్నదానం.

- కమాండెంట్ అంజయ్య చేతుల మీదుగా ప్రారంభం.
- సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి శ్రీకారం.

సత్తుపల్లి, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 15వ బెటాలియన్ పరిధిలోని బి. గంగారం వద్ద ఉన్న శ్రీ భ్రమరాంబికాదేవి సమేత స్వయంభూ మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ ఏ. అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, బెటాలియన్ సిబ్బంది కుటుంబ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కమాండెంట్ ఏ. అంజయ్య, బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్‌(అమ్ములు)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్ అంజయ్య మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా సేవాభావాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో పరిపాలన అధికారి అశోక్, ఆర్‌.ఐలు వై.ఆర్‌.ఎస్‌. నారాయణ, జి. గోపాలరావు, పి. ఉదయకుమార్, ఆర్‌.ఎస్‌.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.IMG-20260215-WA0015

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .