శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి..
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు)
పెనుబల్లి మండలం సోమ్లా నాయక్ తండా బర్మవత్ మంగు నాయక్ అధ్యవవేరంలో. శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జన్మదిన వేడుకలు రంగా రంగా వైభవంగా జరిగింది ముఖ్యఅతిథిగా లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు. ధర్మసొత్ దశరద్ నాయక్ రాష్ట్ర కార్యదర్శి గుగులోతు. కృష్ణ నాయక్.బానోత్ జగన్ నాయక్. నాగేశ్వరావు నాయక్ గంగదేవి పాడు సర్పంచ్ రాధాకృష్ణ నాయక్ క్షత్రియ నాయక్. సర్పంచ్ లక్ష్మీపురం రవీందర్ నాయక్. పెనుబల్లి సర్పంచ్ ప్రసాద్ నాయక్ కోడూరుపాడు సర్పంచ్ వీరన్న నాయక్ తేజవత్ గాదు నాయక్. సంభాశివరావు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు. వెంకటేశ్వరావు తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముందుగా శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు బర్మవత్ మంగు నాయక్ దశరథ నాయక్ మాట్లాడుతూ బంజారా వంశంలో ధైర్యం, సాహసం కలిగించి, ఆధ్యాత్మిక కిరణాలు ప్రసరింప చేయడానికి జన్మించిన మహనీయుడు సంత్ సేవాలాల్.1739లో అనంతపురం జిల్లా గుత్తి మండలం రాంజీ నాయక్ తండాలో జన్మించాడు
సప్త మాతృకలైన తుల్జా భవాని, మంత్రాల భవాని, సీతలా భవాని, హింగలా మాత, కంకాళి భవాని దోలాంగల్ భవాని, దండి భవాని, మేరా మా మా తల ఆశీస్సులతో శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించెను.
ఏక్ జాత్, ఏక్ వాత్, ఏక్ సాత్ అనే ఆలోచన తో ప్రజలను కలిపిన సంఘటనా శీలి.
విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని, పూర్వీజులు అందించిన విలువలు, సంప్రదాయం మరిచిపోవద్దని చాటిన మహాత్ముడు.
తండ్రి రామావత్ భీమ్ నాయక్, తల్లి ధర్మణి యాదిలకు జన్మించి, ఆది పరాశక్తి అంశగా జాతి జనులను జాగృతం చేయవచ్చిన కారణ జన్ముడు.
12 ఏళ్ల వయస్సు లో భృగరాజు గురువు సమక్షంలో దీక్ష పొంది, చాంద్రాయణ గుట్ట వద్ద నున్న కాలోకుండ సరస్సు లో స్నానం ఆచరించి, చెన్న కేశవ స్వామి దర్శనం చేసుకుని, పార్వతి దేవీ సమక్షంలో ధ్యాన నిమగ్నుడయ్యాడు.
జంతుబలులను నిరసించి, అమ్మవారికి పొంగలిని నైవేద్యం పెట్టి, భక్తి సాగరంలో మునిగాడు.
తినడానికి తిండి లేకున్నా ధర్మాన్ని వదలక, సబ్లీ పూజ, హోలీ సంప్రదాయ పండుగలతో ప్రజల్లో ధార్మిక భావన పెంచిన గొప్ప వాడు.
తిరుపతిలో హతీరామ్ బాబా భక్తిని కొనియాడి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని,భక్తి మార్గం లో నడవాలని ప్రజలకు బోధించాడు.
ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి , విలువలు విద్యను ఆర్జించి, నాగరికతతో జీవిస్తూ , ఇతర మతాల్లోకి చేరకుండా, తన ధర్మాన్ని కాపాడుకోవటం అనే సూత్రాలతో ఉద్యమించిన సంత్ సేవాలాల్ మహారాష్ట్ర లో సమాధి పొంది, సేవా నిరతి ని, ఆధ్యాత్మిక చింతనను, భగవత్ తత్వాన్ని పంచిన ఈయన, అందరికి మార్గదర్శకుడు అయ్యాడు అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. పద్మావతి దేవి బాయి పెనంపల్లి మండల అధ్యక్షుడు పండు నాయక్. సోనీ బాయి రూపీ బాయి శిథిలాబాయి మారని బాయి శీను నాయక్ మంగు నాయక్ వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments