కాప్రా లో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ

కాప్రా లో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ

కాప్రా, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు) : 

ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా ప్రాంతంలోని 400 సంవత్సరాల అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం లో పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.నూతన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శివ కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరహర మహాదేవ శబ్దాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.ఈ సందర్భంగా ఈవో రవి శర్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మల్లారెడ్డి, నరేందర్ గౌడ్, బాబురావు, IMG-20260215-WA0117వినోద్, శ్రీధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.మొత్తంగా శివ కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .