సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం

పలువురు సాహితీ ప్రముఖుల అభినందనలు

సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు)

రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కూకట్ పల్లిలో నిర్వహించిన సాహిత్య సంగ్రామంలో ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ కట్టెకోల చిన నరసయ్యను మెమెంటుతో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సంగ్రామం వేదికలో పదిమంది కవుల నుండి పది అంశాలను తీసుకున్నారు ఆ పది అంశాలను లాటరీ తీసి సత్యం శివం సుందరం అనే అంశంపై అర్థగంట సమయంలో కవుల చేత కవయిత్రుల చేత కవితలను రాయించారు. అనంతరం సాహిత్య సంగ్రామంలో కవులు చేత కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కవి సమ్మేళనం కట్టెకోల మానవత్వం ఆవిష్కరించు శీర్షికన రాసిన కవితను ఆలపించారు. అనంతరం జరిగిన సభలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్టార్ ఆచార్య టి గౌరీ శంకర్, రామదాసు సాహితీ కళా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామదూత కోటేశ్వర రావు, ప్రముఖ కవులు విశ్లేషకులు రామకృష్ణ చంద్రమౌళి, గంటా మనోహర్ రెడ్డి, కుసుమ ధర్మన్న కళా పీఠ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ రాధా కుసుమ, బీమా శ్రీనివాసరావులు నరసయ్యను మెమెంటోతో శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .