విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు.!

విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు.!

- లక్ష్య సాధనకు విద్యార్థులు శ్రమించాలి.
- న్యూ సాంగ్ స్కూల్ 22వ వార్షికోత్సవం ఘనంగా.

సత్తుపల్లి, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):

రేజర్లలోని న్యూ సాంగ్ స్కూల్‌లో 22వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 18 గ్రామాల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావు విద్య ప్రాముఖ్యతపై ప్రసంగించారు. చదువుతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సత్తుపల్లి డివిజన్ ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షుడు, విశ్వశాంతి స్కూల్‌కు చెందిన పసుపులేటి నాగేశ్వరరావు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతోనే పిల్లల భవిష్యత్తు సురక్షితమని పేర్కొన్నారు. విద్యార్థులు లక్ష్య సాధనకు కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యమాత డా. సత్యసాయి, న్యాయవాది నాగ పుష్పావతి, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. పాఠశాల అధ్యక్షుడు జైదీప్ ముఖర్జీ, ప్రిన్సిపాల్ సిల్వియా, కారస్పాండెంట్ డా. విక్టర్ ముఖర్జీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు, నాటికలుప్రత్యేక ఆకర్షణగా నిలిచాయిIMG-20260215-WA0050

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .