బాబా నగర్‌లో డ్రైనేజీ సమస్యలపై పర్యటించిన సాయిజెన్ శేఖర్

బాబా నగర్‌లో డ్రైనేజీ సమస్యలపై పర్యటించిన సాయిజెన్ శేఖర్

నాచారం, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ డివిజన్ పరిధిలోని బాబా నగర్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ పర్యటించారు. చాలా కాలంగా డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించకుండానే కొత్త సిమెంట్ రోడ్లు వేశారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా సమస్య ఉన్న వీధుల్లో కాలనీవాసులతో కలిసి పరిశీలించిన సాయిజెన్ శేఖర్, డ్రైనేజీ లైన్లను మ్యాన్‌హోల్ టు మ్యాన్‌హోల్ డీప్ క్లీనింగ్ చేసి సిల్ట్ పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అడ్డంకులు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ విషయమై సంబంధిత డీజీఎం వేణుగోపాల్‌కు ఫోన్ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నారు.
డీప్ క్లీనింగ్ చేసినా సమస్య కొనసాగితే అదనంగా ఒక అడుగు డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేయడానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాబా నగర్ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వివరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .