నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

అడ్డాకల్,ఫిబ్రవరి22(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి నియోజకవర్గం అడ్డాకల్ మండలానికి చెందిన ఆంజనేయులు – లక్ష్మీ దంపతుల కుమార్తె ఉమా నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిశ్చితార్థం అనే తంతు జరిగిందంటే సగం పెళ్లి జరిగినట్లేనని పెద్దలు భావిస్తారని తెలిపారు.ప్రస్తుతం నిశ్చితార్థ వేడుకను కూడా పెళ్లి వేడుకతో సమానంగా ఘనంగా నిర్వహించడం శుభ సూచకమని అన్నారు.ఇలాంటి శుభకార్యాలు కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించిన పెళ్లికూతురు తల్లిదండ్రులు ఆంజనేయులు, లక్ష్మీ దంపతులను ఎమ్మెల్యే అభినందించారు.కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .