రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!

సీతారామ ప్రాజెక్ట్ ప్యాకేజీ-6 కాలువకు భూమిపూజ.

రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!

సత్తుపల్లి, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ–6 కాలువ పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కాలువ పనులు పూర్తయితే రామచంద్రపురం సహా పరిసర ప్రాంతాల రైతుల సాగునీటి సమస్యలు తొలగిపోతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో రామచంద్రపురం సర్పంచ్ రిజ్వాన కరిముల్లా, పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, ఎంఆర్వో, ఎంపీడీఓలు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ, ఈఈ, డీఈ, జేఈ అధికారులు, కేఎన్ఆర్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. మండల నాయకులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాగునీటి వసతి కల్పిస్తున్నందుకు రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.IMG-20260222-WA0036

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .