అన్ని కుల సంఘాలు ఆర్థికంగా ఎదిగి సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలి

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

అన్ని కుల సంఘాలు ఆర్థికంగా ఎదిగి సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలి

పెద్దమందడి,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):

సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని కుల సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రతి సంఘం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.శనివారం పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి సంఘం ఆర్థిక బలోపేతం సాధిస్తే ఆ సంఘ సభ్యుల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించగలదన్నారు.సంఘం అభివృద్ధి చెందితే సభ్యులకు ఎదురయ్యే ఆర్థిక, వైద్య అవసరాల సమయంలో సంఘ నిధుల ద్వారా సహాయం అందించవచ్చని తెలిపారు. సంఘాలకు ప్రాతినిధ్యం వహించే నాయకులు సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు.కార్యక్రమంలో చిన్నమందడి సర్పంచ్ స్వరూప, మాజీ సర్పంచ్ సూర్య చంద్రారెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.IMG-20260221-WA0062

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .