మణిగిళ్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం
Views: 18
On
పెద్దమందడి,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పరీక్షల నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్టడీ అవర్స్‌లో భాగంగా సాయంత్రం అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ , ఉపాధ్యాయులు జానయ్య, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందజేశారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్‌తో పాటు గ్రామ పెద్దలు రాంరెడ్డి, ఎం. బుచ్చన్న, వెంకటయ్య, శ్రీకాంత్ రెడ్డి, ఉప్పురి సాయికుమార్ పాల్గొన్నారు.విద్యార్థులు, గ్రామస్తులు కార్యక్రమాన్ని అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments