వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..

 ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) 

వైరా మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో మోడల్ మున్సిపాలిటీగా తీర్చే బాధ్యత తనదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వైరా మున్సిపాలిటీలో మొదటి మహిళా చైర్మన్ గా కాపా చంద్రకళ ఎన్నికైన వెంటనే వైరా ఎమ్మెల్యే  రామదాసు నాయక్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , మాజీ అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్ తో కలిసి ఆమె మధిర వెళ్లారు అక్కడ ఉపముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా భట్టి  విక్రమార్క చంద్రకళకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు అందుకు ప్రతిగా ఆమె ఉపముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత తనదైనని స్పష్టం చేశారు మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని తన నెరవేరుస్తానని చెప్పారు వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఓటర్లకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఖమ్మం జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా సేవలందిస్తున్న డాక్టర్ కాపముల్లో కృష్ణ చంద్రకళ దంపతులను రాజకీయంగా కూడా రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ 20వ వార్డు కౌన్సిలర్ వుండ్రుc వరలక్ష్మి శ్యాంబాబు నాలుగో వార్డ్ కౌన్సిలర్ నిమ్మతోట శ్రావణి లగడపాటి ప్రభాకర్ రావు లగడపాటి లక్ష్మీ రాజ్యం శీలం చంద్రశేఖర్ రెడ్డి వీరశెట్టి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .