పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

ఎంబీబీఎస్ విద్యార్థి తేజ నాయక్‌కు రూ.10 వేల నగదు అందజేత

పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

పెద్దమందడి,ఫిబ్రవరి16(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం అనకాయపల్లి తండాకు చెందిన గోపాల్ నాయక్ కుమారుడు తేజ నాయక్ వైద్య విద్యలో ప్రవేశం పొంది మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించాలని తండా వాసులు అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ను సంప్రదించారు.దీంతో ఫౌండేషన్ తరపున పుస్తకాల కొనుగోలు కోసం రూ.10 వేల నగదును సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాయినాథ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా డా. సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ సేవలందిస్తున్న ఫౌండేషన్‌ను అభినందించారు. తేజ నాయక్ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.విద్యార్థి తేజ నాయక్ మరియు అతని కుటుంబ సభ్యులు ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .