కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు భక్తుల రద్దీ

కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు భక్తుల రద్దీ

కీసర, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు): 

మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట భవాని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నాలుగో రోజు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు అంగరంగ వైభవంగా నిర్వహించగా, ఆ ఆధ్యాత్మిక ఉత్సాహం నాలుగో రోజు కూడా కొనసాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది.ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ తాటాకం వెంకటేష్, పీఈఓ సుధాకర్ రెడ్డి, గుడి పంతులు మరియు ఇతర ఆలయ సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. IMG-20260216-WA0075భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .