రైతులకు తీరని యూరియా కష్టాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆందోళన

జిల్లా టిఆర్పి యూత్ అధ్యక్షులు రవికుమార్ 

రైతులకు తీరని యూరియా కష్టాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆందోళన

వనపర్తి,ఫిబ్రవరి16(తెలంగాణ ముచ్చట్లు): 

ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులకు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జి. రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మదనాపురం కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం యూరియా కొరత లేదని ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతుల అవస్థలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. నాటు వేసి నెల రోజులు దాటినా పంటలకు యూరియా అందటం లేదని ఆరోపించారు.గ్రామాల్లో నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్ లేని రైతులు సాంకేతిక సమస్యల కారణంగా యూరియాను సకాలంలో పొందలేకపోతున్నారని తెలిపారు. సమయానికి ఎరువు వేయకపోతే దిగుబడి దెబ్బతింటుందని, అప్పులు చేసి పంటలు వేసిన రైతులకు ఇది మరింత భారమవుతుందని చెప్పారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .