గిరిజనులకు కంటపడ్డ శివయ్య.!

గట్టుగూడెం గుట్టపై శివలింగం దర్శనం.

గిరిజనులకు కంటపడ్డ శివయ్య.!

సత్తుపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం గ్రామ చివరలోని గుట్టపై శివలింగం వెలిసినట్లు గిరిజనులు గుర్తించారు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు చేరడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దేవుణ్ణి దర్శించుకోవడానికి గుట్టపైకి వెళ్లేందుకు తరలివచ్చారు. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు భక్తులను గుట్టపైకి వెళ్లనీయక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామస్థులు హిందూ సంఘాల నాయకులకు సమాచారం అందించారు.
గ్రామస్థులకు అండగా నిలిచిన బీజేపీ మరియు హిందూ సంఘాల నాయకులు గుట్టపైకి చేరుకుని శివయ్యను దర్శించుకుని పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తాము అండగా ఉంటామని, దేవుడి విషయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే సహించబోమని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి, సీనియర్ నాయకులు విశ్వేశ్వరరావు, రామాదండు మహిళ అధ్యక్షురాలు నాగవర్ధనమ్మ, చారి, మల్లేశ్, గ్రామస్థులు మరియు భక్తులు పాల్గొన్నారు.IMG-20260216-WA0087

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .