మణిగిళ్లలో మార్నింగ్ వాక్ సందర్భంగా నీటి సమస్యలపై సమీక్ష

మణిగిళ్లలో మార్నింగ్ వాక్ సందర్భంగా నీటి సమస్యలపై సమీక్ష

మిషన్ భగీరథ నీటి సరఫరాపై ఇంటింటి పరిశీలన

-- సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

పెద్దమందడి, ఫిబ్రవరి16(తెలంగాణ ముచ్చట్లు): 

పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో ఉదయం నిర్వహించిన మార్నింగ్ వాక్ సందర్భంగా గ్రామ నూతన సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నీటి సరఫరాపై ప్రత్యేకంగా పరిశీలించారు.రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందుతున్నదా లేదా అనే అంశాన్ని తెలుసుకున్నారు.ఇళ్ల వద్ద నీటి సరఫరా విధానం, ఒత్తిడి సమస్యలు తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు.నీటి సరఫరా అందని ఇళ్లకు ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేసి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.కంట్రోల్ వాల్వులు సరిగా బిగించుకుంటే నీటి సమస్య తగ్గుతుందని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముప్పూరి గణేష్ కుమార్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు పోతుల రామిరెడ్డి, ఎస్ రాములు, పోతుల ప్రతాప్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, బుచ్చన్న, గొంది రామకృష్ణారెడ్డి, దానేలు కొములయ్య, బాలరాజ్, మందడి శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, బి.కె. నాయుడు, సుంచరమోని తిరుపతి, ముప్పూరి సాయికుమార్, సింగం రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .