మొయినాబాద్ మున్సిపాలిటీకి కొత్త నాయకత్వం

చైర్మన్‌గా దూబ సోనియా, వైస్ చైర్మన్‌గా రాజు ఎన్నిక

మొయినాబాద్ మున్సిపాలిటీకి కొత్త నాయకత్వం

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు)

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో నూతన మున్సిపల్ చైర్మన్‌గా దూబ సోనియా, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యింది. మొదటిసారిగా ఈ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఇద్దరూ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైస్ చైర్మన్ రాజు మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం. ఎ. ఫహీం, ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు మొయినాబాద్ మున్సిపాలిటీలోని ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తానని రాజు పేర్కొన్నారు.మున్సిపాలిటీ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, కాలువలు, రహదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, అందరూ కలిసి ముందుకు సాగితే మొయినాబాద్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దగలమని నూతన ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు.IMG-20260216-WA0080

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .