కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా

కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా

అన్నదానం ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు

– ఆరేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పిట్టల రాజు

చర్లపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్, చర్లపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్ కాలనీలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాలనీలోని ప్రసిద్ధ శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా మనీష్ చికెన్ షాప్ ప్రొప్రైటర్ పిట్టల రాజు ఆధ్వర్యంలో భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగలు మన సంస్కృతికి ప్రతీకలని, ఇలాంటి పవిత్ర దినాల్లో పేదలకు, భక్తులకు అన్నదానం చేయడం గొప్ప సేవ అని పేర్కొన్నారు.నిర్వాహకులు పిట్టల రాజు తన స్వంత ఖర్చులతో కాలనీ భక్తుల కోసం చేస్తున్న సేవ అభినందనీయమని, యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.అనంతరం పిట్టల రాజు మాట్లాడుతూ, భగవంతుని కృపతో గత ఆరు సంవత్సరాలుగా ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు సేవ చేయడం తనకు ఎంతో తృప్తి ఇస్తోందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మురళి పంతులు, కరిపే ప్రవీణ్ వంజరి, పెద్దపురం కుమారుస్వామి, రాజిరెడ్డి, యక్కయ్య, ఏస్ ఎ రహీం, సాయిరెడ్డి, హరి, కృష్ణ, రాజు, రాజేష్, నవీన్, రామ్, నర్సింహా, శ్రీనివాస్, విజయ్, కాలనీ ముఖ్య నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.IMG-20260216-WA0097

Tags:

Post Your Comments

Comments

Latest News

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  
వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా
వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం