మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  

హ్యాట్రిక్ విజయం ఆమెపై ప్రశంసల జల్లు..

మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  

ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) 

వైరా మున్సిపాలిటీ తోపాటు, వైరా మేజర్ గ్రామపంచాయితీలో వరుసగా మూడుసార్లు  వేర్వేరు వార్డుల్లో పోటీ చేసి ఓ మహిళ కౌన్సిలర్ గా గెలుపొందింది. ఆమె మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపొంది  హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆమె మాదినేని సునీత. వైరా మేజర్ గ్రామపంచాయితీ గా ఉన్నప్పుడు  6వ వార్డులో  సునీత గెలుపొందారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ తరపున  2018 మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి విజయ డంకా మోగించారు. ప్రస్తుతం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమె 12వార్డు నుంచి మరోసారి కౌన్సిలర్ గా గెలుపొందారు. ఆమె విజయంలో భర్త మాదినేని ప్రసాద్ కీలకపాత్ర పోషించారు. వైరా మున్సిపాలిటీ చరిత్రలో వరుసగా  మూడోసారి విజయం సాధించిన మాదినేని సునీతకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .