వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
Views: 21
On
వనపర్తి,ఫిబ్రవరి16(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి మున్సిపల్ చైర్మన్‌గా మిడిదొడ్డి మాధవి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వెల్టూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్ మాట్లాడుతూ..మాధవి నాయకత్వంలో వనపర్తి పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకంగా పాలన అందించాలని కోరారు.పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో చైర్మన్ కృషి చేయాలని ఆకాంక్షించారు.మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ గెలుపుకు కృషి చేసిన వడ్డే శేఖర్ బృందాన్ని చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, మిల్లర్ రాజు, చందు రెడ్డి, కుమ్మరి కొండన్న తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments