ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు మెరుగుపరచాలి ....

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు మెరుగుపరచాలి ....

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి -16(తెలంగాణ ముచ్చట్లు)

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజలకు అందించే వైద్యసేవలు, రబీ ధాన్యం సేకరణ, వేసవిలో త్రాగునీటి చర్యలు, రోడ్ సేప్టీ పనుల పురోగతి, గ్రామ పంచాయతీ భవనల నిర్మాణాలు,  జిల్లా అధికారుల హాజరు లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉండాలని అన్నారు. గైర్హాజరు, విధులందు నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామాలలో గ్రామ పంచాయతీలకు భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. ఇజిఎస్ లో భవనాల నిర్మాణం చేపట్టవచ్చని, ఈ దిశగా మంజూరు పొందేందుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా కార్యాచరణ చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సమస్యలు పరిష్కరించాలని అన్నారు. హ్యాండ్ పంప్ ల మరమ్మత్తులు, నీటివనరుల గుర్తింపు పూర్తి చేయాలన్నారు.
రబీ సీజన్ దిగుబడి అంచనాలకు తగ్గట్టు కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టికి పెట్టుకొని, సమస్యలను అధిగమించాలన్నారు. గత ధాన్య సేకరణలో ఎదురైన సమస్యలు అధిగమించడానికి పరిష్కార చర్యలతో సిద్దంగా ఉండాలన్నారు. మిల్లర్లకు కొనుగోలుపై ముందే అవగాహన కల్పించాలని, సమస్యలుంటే ముందుగానే పరిష్కరించాలని అన్నారు. ధాన్య కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రమాద ప్రాంతాల్లో రోడ్డు భద్రతా పనులు వేగవంతం చేయాలని, ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ఆధారంగా గుర్తించిన ప్రధాన 30 బ్లాక్ స్పాట్ లలో స్పీడ్ కంట్రోల్ కు రంబుల్ ష్ట్రిప్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని, రోడ్లపై లైన్ మార్కింగ్ తదితర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్ష లో జడ్పీ సీఈఓ దీక్షా రైన, ఆర్&బీ ఎస్ఈ యాకుబ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రామారావు, జిల్లా  డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. చందునాయక్, జిల్లా పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, డిపివో రాంబాబుIMG-20260216-WA0058, మిషన్ భగీరథ ఇఇ లు పుష్పలత, వాణిశ్రీ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  
వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా
వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం