కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా ధరావత్ మోహన్ నాయక్ ఎన్నిక.
వైస్ చైర్మన్‌గా శీలం కోటేశ్వరీ.
Views: 41
On
సత్తుపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా ధరావత్ మోహన్ నాయక్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా శీలం కోటేశ్వరీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసానికి తగ్గట్లుగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments