మహిళాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం.!

మహిళాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం.!

- సత్తుపల్లి మున్సిపల్ చరిత్రలో కొత్త అధ్యాయం.
- ఎమ్మెల్యే–చైర్‌పర్సన్–వైస్ చైర్‌పర్సన్‌గా మహిళలే.

సత్తుపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు): 

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు కీలక పదవులు దక్కడం సత్తుపల్లి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు మహిళలకు కేటాయించడం మున్సిపాలిటీ చరిత్రలో అరుదైన పరిణామంగా నిలిచింది. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి మైనారిటీ వర్గాలకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయాల మధ్య, ఈసారి వారికి అవకాశాలు కల్పించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గత పదేళ్లలోనూ, అలాగే బిఆర్ఎస్ హయాంలోనూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదని తెలిపారు.
ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ కష్టకాలంలో తమ వెంట నిలిచిన ఎండీ కమల్ పాషా దంపతులను గుర్తించి గౌరవప్రదమైన స్థానం కల్పించడం విశేషంగా మారింది.
ఇదే కాకుండా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవుల్లో మహిళలు బాధ్యతలు చేపట్టడం గమనార్హంగా మారింది. మున్సిపల్ చరిత్రలో తొలిసారిగా మూడు కీలక పదవుల్లో మహిళలు ఉండటం మహిళా సాధికారతకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. మహిళలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మహిళాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నాయకులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .