అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎంఎంసి కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎంఎంసి కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే

చర్లపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసి) కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణ రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చర్లపల్లి డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.చర్లపల్లి ప్రాంతంలో రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, కాలనీల్లో మౌలిక వసతుల మెరుగుదల వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ అభ్యర్థనపై కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు నేమూరీ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .