జవహర్ నగర్‌లో దివ్యాంగురాలికి మొబైల్ ఫోన్ అందజేత

జవహర్ నగర్‌లో దివ్యాంగురాలికి మొబైల్ ఫోన్ అందజేత

జవహర్ నగర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):

జవహర్ నగర్ సిపిఐ కాలనీలో నివసిస్తున్న నిరుపేద దివ్యాంగురాలు నికితకు ఎన్ సి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వీర కృష్ణ తేజ ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ అందజేశారు. ఈ కార్యక్రమం  తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు.
సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుత్తికొండ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నికిత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సహాయం అందించారు.
ఎన్ సి గ్రూప్ లక్ష్మి తన మనవడు దత్విక్ చారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులు మరియు ఆపదలో ఉన్న కుటుంబాలకు సహాయం చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన దివ్యాంగులకు అండగా నిలవడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎన్ సి గ్రూప్ కమిటీ సభ్యులు జగన్, ప్రశాంత్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, స్థానిక సీనియర్ జర్నలిస్టులు మరియు పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సహాయానికి దివ్యాంగుల తరఫున మెరుగు శివకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  
వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా
వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం