ఆదర్శ మున్సిపాలిటీగా అశ్వారావుపేట.!

ఆదర్శ మున్సిపాలిటీగా అశ్వారావుపేట.!

- సమిష్టి కృషితో అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే జారె.
- నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా.
- చైర్మన్‌గా జూపల్లి శశికళ,
- వైస్ చైర్మన్‌గా జూపల్లి రమేష్ బాబు బాధ్యతలు స్వీకారం.

అశ్వారావుపేట, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):

అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలి చైర్మన్‌గా ఎన్నికైన జూపల్లి శశికళ, వైస్ చైర్మన్‌గా జూపల్లి రమేష్ బాబు, 15 మంది కౌన్సిలర్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అశ్వారావుపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయ భేదాలను పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో ఏకమై పనిచేయాలని సూచించారు. మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
అలాగే తొలి చైర్మన్ జూపల్లి శశికళ మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని, ఒక్క కాలనీ కూడా వెనుకబడకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ IMG-20260216-WA0083IMG-20260216-WA0081వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా పారదర్శకంగా సేవలు అందిస్తామని చెప్పారు.
కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .